సీబీఐ మాజీ డైరెక్టర్ పై చర్యలకు కేంద్రం సిఫారసు

సీబీఐ మాజీ డైరెక్టర్ పై చర్యలకు కేంద్రం సిఫారసు

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌గా అధికార దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై చర్యలు తీసుకోవాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కి కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. 2018లో అలోక్ వర్మ భారీ వివాదానికి కేంద్రబిందువుగా ఉన్నారు. అప్పటి సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా అలోక్ వర్మపై అవినీతి ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించాయి. సీబీఐ యంత్రాంగం పనితీరుపై అనుమానాలు రేకెత్తే పరిస్థితి ఏర్పడింది. దీంతో  కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్యలకు సిఫారసు చేసింది.  హోం మంత్రిత్వ శాఖ (MHA) మరియు డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) నిబంధనల ప్రకారం వర్మపై చర్య తీసుకోవాలని యుపిఎస్‌సిని కోరింది. పెగాసస్ లిస్టులో అలోక్ వర్మ పేరు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో కేంద్రం చర్యలకు సిఫారసు చేయడం హాట్ టాపిక్ గా మారింది.